ఈరోజే గ్రాండ్ గా లాంచ్ అయిన ప్రశాంత్ వర్మ “హను-మాన్”.!

Published on Jun 25, 2021 12:00 pm IST

తన మొదటి సినిమాతోనే నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ. అక్కడ పైనుంచి కొత్త జానర్స్ తో తెలుగు సినిమాకి వన్నె తెస్తున్న ప్రశాంత్ ఇండియన్ సినిమా దగ్గరే మొట్టమొదటిగా జాంబీ జానర్ పై సినిమా తీసి హిట్టు కొట్టాడు. మరి ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ లైనప్ పై మరింత ఆసక్తి పెరిగింది.

దీనితో ఆ అంచనాలకు తగ్గట్టుగానే తెలుగులో మొట్ట మొదటి సూపర్ హీరో కాన్సెప్ట్ ను పట్టుకున్నాడు ఈ టాలెంటెడ్ దర్శకుడు. తన లాస్ట్ చిత్రం జాంబీ రెడ్డి హీరో తేజ సజ్జతోనే ప్లాన్ చేసిన ఈ చిత్రానికి “హను-మాన్” అనే టైటిల్ పెట్టి ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ను కూడా విడుదల చేసి హైప్ తెచ్చాడు. మరి ఈ క్రేజీ కాంబో ఎట్టకేలకు ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యిపోయింది.

దర్శకుడు హీరో సహా నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు కలిసి ముహూర్తంలో పాల్గొన్నారు.హైదరాబాద్ లో షూట్ జరుపుకున్న ఈ చిత్రంకు జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా నిర్మాత సి కళ్యాణ్ క్లాపింగ్ ఇచ్చారు. అలాగే శివశక్తి దత్త ఫస్ట్ షాట్ ను డైరెక్ట్ చేశారు.

మరి అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ బడ్జెట్ తో గ్రాండ్ వి ఎఫ్ ఎక్స్ విజువల్స్ మరియు సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లతో తెరకెక్కించనున్నారట. అలాగే తేజ లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడి చేయనున్నారు.

సంబంధిత సమాచారం :