జోంబీరెడ్డి తో వస్తున్న ‘అ’ దర్శకుడు..!

Published on Aug 8, 2020 11:06 am IST

మొదటి చిత్రం ‘అ’ తో విభిన్న చిత్రాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ తన ప్రత్యేకత కొనసాగిస్తున్నాడు. గత ఏడాది హీరో రాజశేఖర్ తో క్రైమ్ థ్రిల్లర్ కల్కి చేశారు. ఆ చిత్రం కమర్షియల్ గా అంతగా ఆడకున్నా విమర్శకుల ప్రశంశలు అందుకుంది. కాగా కరోనా వైరస్ ప్రభావం మొదలైన తరువాత ఈ డెడ్లీ వైరస్ పై మూవీ చేస్తున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించారు. కాగా నేడు ఈమూవీ టైటిల్ తో కూడిన మోషన్ పోస్టర్ విడుదల చేశారు. జోంబీ రెడ్డి పేరుతో ఆయన తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జోంబీల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంగా తెలుస్తుంది.

గతంలో కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ తో కూడిన మోషన్ పోస్టర్ విడుదల చేసిన ప్రశాంత్ వర్మ టైటిల్ జోంబీ రెడ్డి అని పెట్టడం ఆసక్తి రేపుతుంది. మరి జోంబీ రెడ్డి మూవీలో ప్రశాంత్ వర్మ దేని గురించి చెప్పనున్నాడో చూడాలి. ఈ మూవీలో నటిస్తున్న వారి వివరాలు తెలియాల్సి ఉంది. కొత్తవారితో ప్రశాంత్ వర్మ ఈ ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నారని తెలుస్తుంది.

మోషన్ పోస్టర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More