మైత్రి సంస్థ, ‘కే.జి.ఎఫ్’ డైరెక్టర్ తో చేస్తున్నమూవీలో హీరో ఎన్టీఆరా?

Published on Jun 5, 2019 3:02 pm IST

మైత్రి మూవీస్ బ్యానర్ ఇండస్ర్టీ కి పరిచయమైన కొద్ది సంవత్సరాలలోనే విజయవంతమైన నిర్మాణ సంస్థగా పేరుతెచ్చుకుంది. శ్రీమంతుడు,జనతా గ్యారేజ్,రంగస్థలం వంటి సూపర్ హిట్ మూవీస్ ఈ బ్యానర్ నిర్మించినవే. ఐతే మైత్రి మూవీ మేకర్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులని అలరించనున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా అలాగే కొన్ని మీడియా సంస్థలు ప్రధానంగా వార్తలు రాస్తున్నాయి.

‘కే.జి.ఎఫ్’ మూవీతో టోటల్ ఇండియా హాట్ ఫేవరేట్ డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ నీల్. సూపర్ స్టార్స్ సైతం ఆయన సై అంటే వెంటనే డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అలాంటి క్రేజి డైరెక్టర్ తో మూవీ చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ ఒప్పదం కుదుర్చుకుందని సమాచారం. అంత కంటే సెన్సేషన్ ఏమిటంటే ఆ మూవీని జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని మైత్రి మూవీ మేకర్స్ ప్రణాళిక తయారు చేస్తున్నారని సోషల్ మీడియా లో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై అటు డైరెక్టర్ నుండి కానీ,ఇటు నిర్మాతల నుండి కానీ ఎటువంటి ప్రకటనలేదు.

ఈ ప్రాజెక్ట్ కనుక ఒకే ఐతే “ఆర్ ఆర్ ఆర్ ” లాంటి భారీ మూవీ తరువాత ఎన్టీఆర్ ఇమేజ్ కి సరిపడా మూవీ అవుతుందని ఫ్యాన్స్ టాక్. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం “కే జి ఎఫ్ 2”ని తెరకెక్కించే పనిలో ఉండగా, ఎన్టీఆర్ “ఆర్ ఆర్ ఆర్ ” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రయత్నాలు కనుక ఫలిస్తే వీరిద్దరి మూవీ 2020 చివర్లో పట్టాలెక్కే ఆస్కారం ఉంటుంది.

సంబంధిత సమాచారం :

More