దర్బార్ లో కాలా యాక్టర్ !

Published on May 1, 2019 12:48 am IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 167 వ చిత్రం దర్బార్ షూటింగ్ గత కొద్దీ రోజులుగా ముంబై లో జరుగుతుంది. ఇటీవల ఈ చిత్రంలోని స్టిల్స్ లీకవ్వడంతో షూటింగ్ స్పాట్ లోకి బయటి వారిని ఎవరని రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏఆర్ మురగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా ప్రతీక్ బబ్బర్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ప్రదీప్ కాబ్రా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఆయన ఇంతకుముందు కాలా లో కూడా నటించాడు.

ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారు. ఇక మొదటిసారి రజినీ – మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈచిత్రం ఫై కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :