నారా రోహిత్ నటించిన ‘ప్రతినిధి’ సినిమా గత శుక్రవారం విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. చూస్తూ ఉంటే నారా రోహిత్ కి బాక్స్ ఆఫీసు వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో చూపించిన పొలిటికల్ కంటెంట్, సూపర్బ్ డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రశాంత్ మండవ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ ని ఆనంద్ రవి అందించాడు.
శుభ్ర అయ్యప్ప హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీ విష్ణు కీలక పాత్ర పోషించాడు. సాంబశివరావు నిర్మించిన ఈ సినిమాకి సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి నారా రోహిత్ కూడా చాలా హ్యాపీ గా ఉన్నాడు.


