ప్రభాస్ ఫస్ట్ డ్యూయల్ రోల్ మూవీకి 11 ఏళ్ళు..!

Published on Apr 3, 2020 12:56 pm IST

ప్రభాస్ కి స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రాలలో బిల్లా ఒకటి. ప్రభాస్ మొదటిసారి డ్యూయల్ రోల్ చేసిన చిత్రం ఇదే కావడం విశేషం. బిల్లా అనే స్టైలిష్ అండ్ డేంజరస్ డాన్ గా రంగ అనే మాస్ పిక్ పాకెటర్ గా రెండు భిన్న రోల్స్ లో నటించాడు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మెహర్ రమేష్ కెరీర్ లో హిట్ మూవీగా బిల్లా నిలిచింది. ముఖ్యంగా స్టైలిష్ డాన్ గా ప్రభాస్ నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. ‘ట్రస్ట్ నో వన్-కిల్ ఎనీ వన్- బి ఓన్లీ వన్..’ అనే డైలాగ్ బాగా పేలింది.

ఇక అనుష్క, నమితల గ్లామర్ షో ప్రేక్షకులకు సూపర్ కిక్ పంచింది. వీరిద్దరూ పోటీపడి మరి అందాల ప్రదర్శన చేశారు. మరో హీరోయిన్ గా క్యామియో రోల్ లో హన్సిక చేసింది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఓ కీలక రోల్ చేశారు. మణిశర్మ పాటలు, బీజీఎమ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. బిల్లా విడుదలై నేటికీ సరిగ్గా 11 సంవత్సరాలు. 2009 ఏప్రిల్ 3న ఈ చిత్రం విడుదలైంది.

సంబంధిత సమాచారం :

X
More