శరవేగంగా “విజయ్ – వంశీ” చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు!

Published on Dec 30, 2021 12:00 am IST

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అయిన దిల్ రాజు మరియు శిరీష్ లు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై విజయ్ హీరోగా సినిమా ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కి నేషనల్ అవార్డ్ విజేత అయిన వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ కెరీర్ లో భారీ బడ్జెట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం కి సంబంధించిన అధికారిక ప్రకటన ను ఇటీవల చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు మరియు తమిళ పరిశ్రమలకు చెందిన నటీనటులను ఈ చిత్రం కోసం తీసుకోనున్నారు. ఈ చిత్రం ను ప్రకటించిన సందర్భం నుండి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :