29న ప్రేమ అంత ఈజీ కాదు !

29న ప్రేమ అంత ఈజీ కాదు !

Published on Mar 24, 2019 10:50 AM IST

రాజేష్‌కుమార్‌, ప్రజ్వాల్‌ జంటగా టి. అంజయ్య సమర్పణలో ఈశ్వర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. పారిజాత మూవీ క్రియేషన్స్‌ పతాకంపై టి.నరేష్‌, టి.శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ పారిజాత హోమ్స్ అండ్ డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ టీ అంజయ్య చిత్ర యూనిట్ సమక్షంలో విడుదల చేశారు.

అనంతరం, టీ అంజయ్య మాట్లాడుతూ.. ప్రేమ అంత ఈజీ కాదు సినిమాకు యూ సర్టిఫికెట్ వచ్చింది. మా చిత్రానికి యూ సర్టిఫికెట్ రావడం చాలా సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే విధంగా మా సినిమాను రూపొందించాం. మా సినిమా విజయం సాధిస్తుందనే అంశానికి మరింత విశ్వాసం కలిగింది అని అన్నారు. హీరో రాజేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రేమ అంత ఈజీ కాదు సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. చాలా కష్టపడి సినిమాను అద్భుతంగా తీసుకొచ్చాం. తప్పుకుండా విజయం సాధిస్తుందనే భరోసా ఉంది అన్నారు.

నిర్మాతలు శ్రీధర్, నరేష్ మాట్లాడుతూ.. ‘ప్రేమ నేపథ్యంలో సాగే కథ ఇది. మనసుకి నచ్చిన వ్యక్తి ప్రేమను గెలుచుకోవడం ఎంత కష్టమో తెలిపే సినిమా ఇది అని చెప్పారు. ధనరాజ్‌, రాంప్రసాద్‌, ముక్తార్‌ఖాన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయగ్రహణం: చక్రి, సంగీతం: జై.యం, ఎడిటింగ్‌ : శ్రీనివాస్‌ కంబాల…

సంబంధిత సమాచారం

తాజా వార్తలు