‘ప్రేమకథా చిత్రమ్ 2’ టీజర్ విడుదలతేదీ ఖరారు !

Published on Dec 18, 2018 9:51 am IST


సుధీర్ బాబు , నందిత జంటగా మారుతి తెరకెక్కించిన ‘ప్రేమకథా చిత్రమ్’ సెన్సషనల్ హిట్ అయ్యి హార్రర్ కామెడీ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతుంది. ‘ప్రేమ కథా చిత్రమ్ 2’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ అలాగే ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ నందిత శ్వేతా, సిద్ది ఇద్నాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈచిత్రం యొక్క టీజర్ డిసెంబర్ 21న ఉదయం 11:45 గంటలకు విడుదలకానుంది. నూతన దర్శకుడు హరికిషన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ పి ఏ క్రీయేషన్స్ పతాకం ఫై సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

జేబీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకానుంది. మరి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం విజయాన్ని సాధిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :