ఉగాది రోజున విడుదలకానున్న హారర్ థ్రిల్లర్ !

ఉగాది రోజున విడుదలకానున్న హారర్ థ్రిల్లర్ !

Published on Mar 22, 2019 9:02 PM IST

సూపర్ హిట్ హారర్ కామెడీ మూవీ ప్రేమకథాచిత్రమ్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమ కథా చిత్రమ్ 2’. సుమంత్ అశ్విన్, నందిత శ్వేతా, సిద్ది ఇద్నాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు హరికిషన్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం ఈనెల 21న విడుదలకావాల్సి ఉండగా వాయిదాపడింది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా ఏప్రిల్ 6న విడుదలచేయనున్నారని సమాచారం.

ఆర్ పి ఏ క్రీయేషన్స్ పతాకం ఫై సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమెడియన్స్ ప్రభాస్ శ్రీను , విద్యుల్లేక రామన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జేబీ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు