మూడో సింగిల్ లాంచ్ లో ‘ప్రేమపిపాసి’ !

Published on Mar 7, 2020 10:23 pm IST

జీపీయస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. ఎస్‌.ఎస్‌. ఆర్ట్‌ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్‌ పతాకాలపై రాహుల్‌ భాయ్‌ మీడియా, దుర్గశ్రీ ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్‌ రామకృష్ణ (ఆర్‌.కె) నిర్మాత. మురళీ రామస్వామి (యం.ఆర్‌) దర్శకుడు. ఈ నెల 13న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా నుంచి మూడో సింగిల్ `ఐ ఫోన్ అంటి పిల్లంటూ` అనే సాంగ్ ని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంచ్ చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ..“ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా సాంగ్ చాలా బావుంది. ఈ నెల 13న రిలీజ్ కాబోతున్న సినిమా సక్సెస్ సాధించి టీమ్ అందరికి మంచి పేరు రావాలని“ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ విడుదలైన తర్వాత సినిమాకి మంచి హైప్‌ వచ్చింది. ఇటీవల మా సినిమా యూనిట్‌తో పాటు కొంతమంది యూత్‌కు సినిమా చూపించాం. అందరూ ఇప్పటి ట్రెండ్‌కన్నా అడ్వాన్డ్స్‌గా ఉందన్నారు. నిజమైన ప్రేమంటే ఎలా ఉంటుందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే” అన్నారు. ‘‘ట్రైలర్‌కు, ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు బజ్‌ వచ్చింది. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు జీపీయస్‌. జిపిఎస్‌ , కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, జ్యోతి రాజ్‌ పుత్‌, మమత శ్రీ చౌదరి, ‘ఢీ జోడి ఫేమ్‌’ అంకిత , బిగ్‌ బాస్‌ ఫేమ్‌ బందగీ కర్ల , సంజన చౌదరి , సుమన్‌ , భార్గవ్‌ , షేకింగ్‌ శేషు, జబ్బర్దస్థ్‌ రాజమౌళి, ఫసక్‌ శశి, ఫన్‌ బకెట్‌ భరత్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డీఓపీ తిరుమల రోడ్రిగ్జ్‌ , మ్యూజిక్‌: ఆర్స్‌ , పాటలు : సురేష్‌ ఉపాధ్యాయ-అల రాజు, సౌండ్‌ డిజైన్‌ :యతిరాజ్‌ , పీఆర్వో : వంగాల కుమారస్వామి , ఎడిటర్‌: ఎస్‌ శివ కిరణ్‌, ఫైట్స్‌: మిస్టర్‌ దేవ్‌, కో-ప్రొడ్యూసర్స్‌ : రాహుల్‌ పండిట్‌, జిఎస్‌ రావు, వై వెంకట లక్ష్మి , అసోసియేట్ ప్రొడ్యూసర్‌ :యుగంధర్‌ కొడవటి , ప్రొడ్యూసర్‌ : పియస్‌ రామకృష్ణ (ఆర్కే), రచన-దర్శకత్వం: మురళి రామస్వామి (ఎమ్‌ .ర్‌ ).

సంబంధిత సమాచారం :

More