చిన్న సినిమాను విడుదలచేయనున్న ప్రముఖ నిర్మాత !

చిన్న సినిమాను విడుదలచేయనున్న ప్రముఖ నిర్మాత !

Published on Jul 25, 2018 5:00 PM IST

Premaku Raincheck
‘సర్దార్ గబ్బర్ సింగ్, కాటమ రాయుడు , గోపాల గోపాల’ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఇప్పుడు ఒక చిన్న సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ‘ప్రేమకు రెయిన్ చెక్’ అనే ఆసక్తికర టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై శరత్ మారార్ విడుదలచేయనున్నారు.

నూతన దర్శకుడు ఆకెళ్ళ పెరి శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అభిలాష్ వాడాడ , ప్రియా వడ్లమాని , మౌనిక హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. దీపక్ కిరణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు