
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య – గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘సాహసమే శ్వాసగా సాగిపో’ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మరో 10-15 రోజుల్లో షూటింగ్ పూర్తి కానున్న ఈ మూవీ సెకండ్ టీజర్ ని చైతన్య బర్త్ డే కానుకగా నవంబర్ 23న రిలీజ్ చేయనున్నారు. ఇది పక్కన పడితే నాగ చైతన్య నటించనున్న నెక్స్ట్ మూవీ మలయాళ సూపర్ హిట్ మూవీ ‘ప్రేమమ్’కి రీమేక్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాని నవంబర్ చివర్లో 30వ తేదీన లాంచ్ చేయనున్నారని ఇది వరకే తెలిపాం.
తాజాగా ఈ సినిమాకి సంబందించిన మరో ఆసక్తికరమైన న్యూస్ ని అందిస్తున్నాం. ఈ సినిమాలో రెండు అతిధి పాత్రలకి ప్రాముఖ్యత ఉంది. అందులో ఓ పాత్రకి వెంకీ లేదా నాగార్జునని అనుకుంటున్నారు. ఎక్కువభాగం నాగార్జున చేసే అవకాశం ఉంది. అది కాకుండా సినిమాకి కీలకమైన మరో యంగ్ స్టర్ పాత్ర కోసం యంగ్ హీరో నితిన్ ని ఫైనలైజ్ చేసారు. మలయాళంలో అనంత్ నాగ్ చేసిన రోల్ ని నితిన్ చేయడానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం. సినిమా లాంచ్ రోజున ఈ విషయాలను అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. కార్తికేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ని సెలక్ట్ చేయగా, మిగిలిన ఇద్దరి కోసం అన్వేషణ జరుగుతోంది.

