“ఆచార్య”లో చరణ్ పై ఇంకా ఈ సీన్ నే తీస్తున్నారా.?

“ఆచార్య”లో చరణ్ పై ఇంకా ఈ సీన్ నే తీస్తున్నారా.?

Published on Jan 30, 2021 4:00 PM IST

ramcharan

ఇపుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబోలో వచ్చిన “ఆచార్య”టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో అదరగొడుతుంది. ఇక అలాగే ఈ టీజర్ కు గాను ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన వాయిస్ ఓవర్ ను అందివ్వడం మరో హైలైట్ గా నిలిచింది.

అయితే మరి చరణ్ ఈ సినిమాలో సిద్ధ గా ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడని అనౌన్స్ చెయ్యడంతో మరిన్ని అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి. అయితే మరి లేటెస్ట్ టాక్ ప్రకారం ఇప్పుడు ఈ సినిమా షూట్ జరుగుతూనే ఉంది. మెగాస్టార్ కూడా షూట్ లో ఉన్నారు. కానీ ఇంకా చరణ్ పై ఇంట్రో షాట్స్ పూర్తి కానట్టే తెలుస్తుంది.

అందుకే అవి కూడా చేసేస్తున్నారట. ఈ సీక్వెన్స్ పై మంచ్చి అంచనాలే కొరటాల ఈ షాట్ ప్రత్యేకంగా వెంట్రుకలు నిక్కబొడిచేలా తీస్తున్నారని వినిపిస్తుంది. మరి చరణ్ ఎంట్రీ ఏ లెవెల్లో ఉంటుందో తెలియాలి అంటే వచ్చే మే 13 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు