సూపర్ స్టార్ తో మరో సినిమా చేస్తున్న పృథ్విరాజ్

Published on Jun 19, 2021 3:01 am IST

మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకుడిగా కూడ మంచి పాపులర్. మోహన్ లాల్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన ‘లూసిఫర్’ మలయాళం ఇండస్ట్రీలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయింది. దీన్నే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. మోహన్ రాజా ఈ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పృథ్విరాజ్ దర్శకత్వానికి దూరంగా ఉంటూ హీరోగా వరుస సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ మళ్లీ ఆయన మెగాఫోన్ పట్టాలని డిసైడ్ అయ్యారు. ఈసారి కూడ ఆయన మోహన్ లాల్ తోనే వర్క్ చేస్తున్నారు.

మోహన్ లాల్ అంత బిజీగా ఉన్నప్పటికీ పృథ్విరాజ్ సుకుమారన్ కథ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘బ్రో డాడీ’ అనే సినిమా టైటిల్. ఇది కంప్లీట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆశీర్వాద్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో పృథ్విరాజ్ సుకుమారన్, మీనా, కళ్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలు చేస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాతో అందరూ హాయిగా నవ్వుకునేలా చేస్తుందని అంటున్నారు పృథ్విరాజ్.

సంబంధిత సమాచారం :