ఘనంగా ‘సుయోధన’ సక్సెస్ మీట్

ఘనంగా ‘సుయోధన’ సక్సెస్ మీట్

Published on Mar 29, 2026 6:00 PM IST

1 7

ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా.. డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ నటి ప్రేమ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సుయోధన’. ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై వై.ఎస్. మాధవ్ రెడ్డి దర్శకత్వంలో బోసుబాబు నిడుమోలు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (ఈ నెల 27న) విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రాబడుతోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా నిర్మాత బోసుబాబు మాట్లాడుతూ.. తమ తొలి ప్రయత్నానికే ప్రేక్షకులు అద్భుత విజయాన్ని అందించారని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఓ ప్రముఖ సంస్థతో కలిసి, పక్కా ప్రణాళికతో మరో బ్లాక్‌బస్టర్ సినిమా నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. చిన్న సినిమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర కీలకమని డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు అన్నారు. సినిమాలో ప్రియదర్శి, సాయికుమార్ పోటాపోటీగా నటించారని, దర్శకుడు మాధవ్ ఎంతో అనుభవజ్ఞుడిలా ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా తెరకెక్కించారని ఆయన ప్రశంసించారు.

దర్శకుడు వై.ఎస్. మాధవ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సుయోధన’కు అన్ని వర్గాల నుంచి వస్తున్న స్పందనతో ప్రతి షోకు థియేటర్ల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి సైతం ప్రశంసలు దక్కుతున్నాయన్నారు. ప్రియదర్శి, సాయికుమార్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు