ఆ హీరోయిన్ తల్లి కాబోతుందట ?

Published on Jul 29, 2018 1:59 pm IST

జూ.ఎన్టీఆర్ సరసన యమదొంగ చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన హీరోయిన్ ప్రియమణి. ఆమె మంచి నటిగా ప్రేక్షకుల్లో గుర్తింపుతో పాటు పలు అవార్డ్ లను కూడా గెలుచుకున్నారు. అయినప్పటికీ ప్రియమణి మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. దాంతో లాస్ట్ ఇయర్ ముస్తఫా రాజ్ అనే అతన్ని వివాహం చేసుకున్నారు.

కాగా ఆమె వివాహం చేసుకున్నా సినిమాలకు మాత్రం దూరం కాలేదు. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా ఆమె ఐదారు కన్నడ చిత్రాల్లో నటించారు. మొన్నటివరకు తెలుగులో ‘ఢీ 10’ డాన్స్ షో న్యాయనిర్ణేతల్లో ఒకరిగా చేశారు. ఐతే ఆమె గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఆమె త్వరలో తల్లి కాబోతున్నారనేదే ఈ వార్త. కాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ వార్త నిజమేనని తెలుస్తోంది. ఐతే ప్రియమణి అధికారికంగా ప్రకటించేదాకా నిర్ధారించలేము.

సంబంధిత సమాచారం :