‘తలైవి’లో శశికళగా స్టార్ నటి

Published on Dec 3, 2019 11:08 pm IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలైన దగ్గర్నుండి ప్రేక్షకుల్లో ఒక ప్రశ్న ఆసక్తికరంగా మారింది. అదే జయలలిత వ్యక్తిగత, రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించి, జయ మరణం తర్వాత సిఎం పీఠం కోసం ప్రయత్నించి జైలుకి వెళ్లిన ఆమె నెచ్చెలి శశికళ పాత్రను ఎవరు చేస్తారు అని.

తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ పాత్రలో ప్రముఖ నటి ప్రియమణి నటిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక క్కన్ఫర్మేషన్ వెలువడాల్సి ఉంది. అలాగే దివంగత నేత, మాజీ సీఎం ఎంజిఆర్ పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నాడు. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ‘తలైవి’గా వస్తున్న ఈ చిత్రం హిందీలో ‘జయ’ పేరుతో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More