‘ప్రియాంక’కు నిక్‌ విడాకులు ఇస్తాడట !

Published on Jul 12, 2021 7:55 pm IST

గ్లోబల్ స్టార్ హీరోయిన్ ‘ప్రియాంక చోప్రా’ నిక్ జోనస్ ను 2018లో ఘాడంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. తనకంటే నిక్‌ పదేళ్లు చిన్న వాడు అయినా ప్రేమకు వయసుతో పనేంటి అంటూ ప్రియాంక అతన్ని వివాహమాడి ప్రస్తుతం సంతోషంగా ఉంది. అయితే ప్రియాంక చోప్రాకి రానున్న కాలంలో విడాకులు ఖాయం అంటూ సినీ విశ్లేషకుడు కమల్‌ ఆర్‌ ఖాన్‌ చెప్పుకొచ్చాడు.

పైగా కమల్‌ ఆర్‌ ఖాన్‌ ట్వీట్ చేస్తూ ‘ప్రియాంకకు ఆమె భర్త నిక్‌ జోనస్‌ మరో పది సంవత్సరాలలో విడాకులు ఇవ్వడం తథ్యం’ అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ ట్వీట్ చూసిన ప్రియాంక ఫ్యాన్స్ అతని పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘ప్రియాంక జంట విడిపోవాలని కోరుకునే హక్కు నీకెక్కడిది ?

అసలు స్టార్ల వ్యక్తిగత విషయాల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావ్ ? అంటూ మండిపడుతున్నారు. అయితే సెలబ్రిటీల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించడమే తన జాబ్ అన్నట్టు వ్యవహరించే కేఆర్‌కే తన విమర్శలను మాత్రం మానడం లేదు.

సంబంధిత సమాచారం :