సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్, ఆర్. మాధవన్ వంటి అగ్ర నటులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం విశేషం.
ఇటీవల ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ మూవీ ‘ద బ్లఫ్’ చూసిన మహేష్ బాబు, ఆమె నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. దీనికి ప్రియాంక “సీ యూ సూన్ ఇన్ అంటార్కిటికా” అంటూ రిప్లై ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనిబట్టి ‘వారణాసి’ నెక్స్ట్ షెడ్యూల్ అంటార్కిటికాలో ఉండబోతుందని స్పష్టమవుతోంది. రాజమౌళి మార్క్ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన ఈ మూవీని ఐమ్యాక్స్ అనుభూతిని ఇచ్చేలా రూపొందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఏప్రిల్ 7, 2027న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Thank you my friend 🙏🏽 🏴☠️
See you soon in Antarctica. ⭐️ @urstrulyMahesh https://t.co/HpBfRPbMEg— PRIYANKA (@priyankachopra) March 1, 2026


