ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్‌లో ప్రియాంక సాలీడ్ మార్క్..!

Published on Jul 2, 2021 1:43 am IST


సోషల్ మీడియాలో భాగమైన ఇన్‌స్టాగ్రామ్ అంటే ఇప్పుడు తెలియని వారుండరు. సాధారణ ఇన్‌స్టా యూజర్లను కాస్త పక్కనపెడితే సినీ సెలబ్రిటీలు, క్రీడాకారులు మరియు కొందరు ప్రముఖులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ రకరకాల పోస్టులను పెడుతూ ఉంటారు. అయితే వీళ్లందరూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసే ఒక్కో ప్రమోషనల్ పోస్ట్ నుంచి ఎంత మేరకు ఆదాయాన్ని సంపాదిస్తారో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవడం గ్యారంటీ.

అయితే ఇన్‌స్టాలో ప్రమోట్ చేసిన ప్రతి పోస్ట్‌కి ఎవరెవరు ఎంత వసూలు చేస్తారు అనే దాని ఆధారంగా ప్రతి ఏడాది ర్యాంక్స్ ఇస్తుంటారు. అయితే ఈ ఏడాది ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్‌లో ఇద్దరు భారతీయులకు చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 19వ స్థానంలో నిలవగా, ప్రియాంక చోప్రా 27వ స్థానంలో నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 64 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగిన ప్రియాంక అందులో చేసే ప్రతి ప్రమోషనల్ పోస్ట్‌కు $403,000 (రూ.3 కోట్లు) పొందుతున్నట్లు తెలుస్తుంది. ఇక గత ఏడాది కూడా ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్‌లో 19వ స్థానంలో నిలిచింది.

సంబంధిత సమాచారం :