‘మహానటి’ సావిత్రిలోని మానవీయ కోణాన్ని ఆవిషరిస్తుందట !
Published on Apr 24, 2018 1:53 pm IST

యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం ‘మహానటి’ సినిమాకు ఆఖరి మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. అలనాటి స్టార్ హీరోయిన్ సావిత్రి జీవితం ఆధారంగా రూపొందనుండటం, ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, టీజర్ వంటివి ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇందులో ప్రధాన పాత్రను కీర్తి సురేష్ పోషించగా, దుల్కర్ జెమినీ గణేశన్ పాత్రను, సమంత, విజయ్ దేవరకొండలు జర్నలిస్టుల పాత్రల్ని చేశారు. ఈ సినిమా గురించి తెలిసిన పాత తరం ప్రేక్షకులంతా తమ సావిత్రిని మరోసారి స్క్రీన్ మీద చూడాలని ఆరాటపడుతుంటే ఈ తరం ప్రేక్షకులు మాత్రం ఒకప్పటి సావిత్రి స్టార్ డమ్ ఎలాంటిదో తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నారు.

నిర్మాత ప్రియాంక దత్ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ ఈ సినిమాలో సావిత్రిగారి స్టార్ డమ్ తో పాటు ఆమెలోపని మానవీయ కోణాన్ని కూడ అద్భుతంగా ఆవిష్కరించడం జరిగిందని, సినిమా గురించి రీసెర్చ్ చేసేప్పుడు సావిత్రిగారి కుటుంబ సభ్యులు, సహా నటులు సన్నిహితులు తెలిపిన పలు సంఘటనల ఆధారంగా సావిత్రి ఎంత గొప్పవారో చూపే ప్రయత్నం చేశామని అన్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook