కాలేజీ యూనిఫామ్ లో చైతు – సమంత !

కాలేజీ యూనిఫామ్ లో చైతు – సమంత !

Published on Mar 10, 2019 4:06 PM IST

సమంత, నాగ చైతన్య హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న మజిలీ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కాబోతున్నది. రేపు సాయంత్రం 4:59 గంటలకు ఈ చిత్రం రెండో సాంగ్ విడుదల కాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. పోస్టర్ లో కాలేజీ యూనిఫామ్ లో చైతన్య స్మార్ట్ లుక్ లో కనిపించగా.. సమంత కూడా సన్నగా స్మార్ట్ గా కనిపిస్తోంది.

ఇక చైతు ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. యంగ్ గెటప్ లో ఒకలా.. సమంతతో పెళ్లి తరువాత గెడ్డంతో మరో గెటప్ లో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా నటి దివ్యంశ కౌశిక్ ముఖ్య పాత్రలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు