బోయపాటి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న నిర్మాత !
Published on Oct 25, 2016 8:44 am IST

boyapati-abhishek
అర్సకుడు బోయపాటి శ్రీను, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. ఇటీవలే ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టును అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం అభిషేక్ ఈ ప్రాజెక్ట్ నుండి పూర్తిగా పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తోంది. అలాగే నాగ చైతన్య హీరోగా నటించిన ‘సాహసం స్వాసగా సాగిపో’ చిత్రాన్ని నిర్మించిన ఎం. రవీంద్ర రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తారని కూడా తెలుస్తోంది. నిన్నటి వరకూ ఈ విషయంపై పూర్తి కన్ఫర్మేషన్ రాలేదు గాని ఇప్పుడు మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

అసలు అభిషేక్ ఈ ప్రాజెక్ట్ నుండి ఎందుకు తప్పుకున్నారు అని ఆరాతీస్తే ఈ సినిమాతో పాటు అభిషేక్ మరో నాలుగు సినిమాల్ని ఒకేసారి నిర్మించాలని పాలన్ చేసుకున్నాడు. దీంతో నిర్మాత, హీరో తండ్రి బెల్లంకొండ సురేష్ అభిషేక్ ఈ ప్రాజెక్టు మీద పూర్తిగా శ్రద్ద పెట్టలేరేమోనని సందేహించారట. దీంతో అభిషేక్ ఇక ఈ సినిమాపై కొనసాగడం తగదని నిర్ణయించుకుని ముందుగానే తప్పుకున్నారని వినికిడి. ఇకపోతే ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిచనుండగా, దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు.

 
Like us on Facebook