పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ OG మరియు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలలో తదుపరి కనిపించనున్నారు. మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరి హర వీరమల్లు అనే పీరియాడికల్ ఫ్లిక్ చేస్తున్నాడు. రూల్స్ రంజన్ ప్రెస్ మీట్ సందర్భంగా చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ మరియు విడుదల తేదీకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ గారు ఇతర సినిమాలు మరియు రాజకీయాలతో కూడా బిజీగా ఉన్నారు. ఈలోగా, HHVM ఒక పీరియాడికల్ డ్రామా కాబట్టి సెట్స్ వేయడానికి సమయం పడుతుంది. కాబట్టి సినిమా పూర్తి కావడానికి ఇంకొన్ని నెలలు పడుతుంది అని అన్నారు. 2023 చివరి నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేసి, ఎన్నికలలోపు సినిమాను విడుదల చేస్తాం అని తెలిపారు. ఈ అప్డేట్స్ విన్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరో బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో నిధి అగర్వాల్ కథానాయిక. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.