అఖిల్‌ ‘ఏజెంట్‌’ మూవీపై క్లారిటీ మరియు అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!

Published on May 18, 2022 2:34 am IST


అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ “ఏజెంట్”. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌” వంటి హిట్ తర్వాత అఖిల్‌ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. అయితే నిర్మాత అనిల్‌ సుంకరతో దర్శకుడు సురేందర్‌ రెడ్డికి అభిప్రాయ బేధాల ఏర్పడ్డాయని దీంతో సురేందర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారని, సినిమా ఆగిపోయిందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ వార్తలపై నిర్మాత అనిల్‌ సుంకర సోషల్‌ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అఖిల్ ‘ఏజెంట్‌’ సినిమా కొత్త షెడ్యూల్‌ త్వరలోనే మనాలీలో ప్రారంభమవుతుందని, అంతేకాదు త్వరలోనే టీజర్‌ అప్‌డేట్‌ కూడా ఇస్తామని, దయచేసి అఫీషియల్‌ ట్వీట్స్‌ మాత్రమే ఫాలో అవ్వండి. రూమర్స్‌ గురించి పట్టించుకోవద్దంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ క్లారిటీతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టత వచ్చింది.

సంబంధిత సమాచారం :