బాలయ్య సినిమాకి ప్రొడ్యూసర్ మారుతున్నాడా ?

Published on Mar 6, 2019 3:00 am IST

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ‘జూన్’ నుండి ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. మొదట ఈ నెలలో షూట్ అనుకున్నప్పటికీ… ఏపీలో జరగబోయే ఎలక్షన్స్ పూర్తి అయ్యాకే ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేశారు బాలయ్య.

అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రొడ్యూసర్ మారుతున్నట్లు తెలుస్తోంది. మొదట బాలయ్యనే ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల.. సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని తెలుస్తోంది.

ఇక గతంలో బాలయ్యకు ‘సింహ, లెజెండ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చిన బోయపాటి, ఈ సారి అలాంటి సూపర్ హిట్ ని ఇచ్చి.. వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More