ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్ వర్రీ కావాల్సిన అవసరం లేదు..!

Published on Apr 4, 2020 10:01 am IST

బడా ప్రొడ్యూసర్ డి వి వి దానయ్య ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలపై వస్తున్న పుకార్లను ఖండించారు. చెప్పిన ప్రకారం ఆర్ ఆర్ ఆర్ జనవరి 8, 2021న విడుదల అవుతుందని ఆయన కుండబద్దలు కొట్టారు. కొన్ని రోజులుగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే చిత్ర పరిశ్రమ స్వచ్ఛందంగా షూటింగ్స్ కి బంద్ ప్రకటించడం జరిగింది. దీని కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి సైతం బ్రేక్ పడింది.

కొద్దిరోజుల క్రితం నార్త్ ఇండియాలో మొదలు కావలసిన షెడ్యూల్ ఆగిపోయింది. దీనితో మరో మారు ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా పడడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతుంది. ఇదే విషయంపై నిర్మాత డి వి వి దానయ్య స్పందించారు. లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా పడుతుందనే వార్తలలో నిజం లేదని చెప్పారు. ఇప్పటికే చాల వరకు గ్రాఫిక్ వర్క్ పూర్తయింది, మిగిలిన షూటింగ్ పార్ట్ పూర్తి చేసి చెప్పిన సమయానికి చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్, చరణ్ లు భీమ్-అల్లూరి పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More