ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి రాబోతున్న పలు సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనే సదుద్దేశంతో పూర్తిగా కొత్త నటీనటులు సాంకేతిక బృందంతో చేసిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ కూడా ఒకటి. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ ఒకింత ఎమోషనల్ గా మారాయి.
ఈ ఈవెంట్ లో నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – “మా అమ్మానాన్న, అన్నయ్య ఆశీస్సుల వల్లే ఈ వేదిక మీద ఉండగలిగాను. నేను చేసే ప్రయత్నాలకు మీరంతా సపోర్ట్ గా నిలుస్తున్నారు. మా ముని గురించి, హీరో హీరోయిన్స్ ఇతర టీమ్ అందరి గురించి ఈ నెల 17వ తేదీ తర్వాత మాట్లాడుతా. వాళ్లంతా అద్భుతమైన వర్క్ చేశారు. చిన్న చిత్రాల్లో తిమ్మరాజుపల్లి టీవీ సినిమా బెంచ్ మార్క్ సెట్ చేయబోతోంది. ఒక చిన్న బడ్జెట్ లో టెక్నికల్ గా ఇంత క్వాలిటీగా, ఇంత బ్రిలియంట్ గా మూవీ చేయోచ్చా అని ఆశ్చర్యపోతారు. సోదరుడు వంశీకాంత్ మా మూవీకి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజిక్ కోసం థియేటర్స్ కు వెళ్లేవాళ్లను మా సినిమాలోని సౌండింగ్ రెండు రోజులు హాంట్ చేస్తుంది. నేను వీళ్లకు అవకాశం ఇచ్చానని, సినిమా చేశానని అందరితో అనిపించుకోవడం కంటే ఒక జెన్యూన్ సినిమా చేశామనే గుర్తింపు పొందడమే నాకు సంతోషాన్నిస్తుంది. తిమ్మరాజుపల్లి అనే ఊరిలో జరిగిన ఘటనల నేపథ్యంగా ఇంత థ్రిల్లింగ్ గా, ఎంగేజింగ్ గా సినిమా రూపొందించవచ్చా అని మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది. ఇండస్ట్రీలోని వారిని నా సినిమాలకు సపోర్ట్ చేయమని ఎప్పుడూ అడగలేదు.కానీ ఈ సినిమాకు సపోర్ట్ చేయమని కోరుతున్నా.ఎందుకంటే కనీసం యాభై కుటుంబాల ఆశలు ఈ సినిమా మీద ఉన్నాయి. నాకు వీలైనంత సపోర్ట్ వారికి నేను చేశాను. మీరు కూడా సపోర్ట్ చేస్తే కొత్తవాళ్లకు మరింత హోప్స్ ఇచ్చినట్లు ఉంటుంది. మీడియా మిత్రులు కూడా మా సినిమాకు సహకారం అందించాలని కోరుతున్నా. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన డబ్బులు రావాలి, నా పెట్టుబడి రాకున్నా ఫర్వాలేదు. ఈ కొత్త వాళ్ల లైఫ్స్ సెట్ కావాలి. నేను కోరుకునేది అదే. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడం గొప్పగా భావించడం లేదు. మనం చేయాల్సిన బాధ్యతగా ఫీలవుతున్నా. ఊర్లల్లో సినిమా ఇండస్ట్రీ గురించి కలలుకనే వారికి చెబుతున్నా మీరు ధైర్యంగా అనుకోండి ఏది అనుకుంటే అది అవుతారు. ఎవరూ నిరుత్సాహపడకండి. నాకు ఏ గుర్తింపు లేనప్పటి నుంచే నన్ను నమ్మింది రహస్య. నా సక్సెస్ కు ఆమె కారణం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తుంటే ఫేర్ వెల్ ఫీలింగ్ కలుగుతోంది. మా చిన్న చిత్రానికి ఇండియాలో పెద్ద స్క్రీన్ మీద ప్రీమియర్ వేస్తున్నాం.మీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. సినిమాను ప్రేమించే తెలుగు ప్రేక్షకులే మా తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను సపోర్ట్ చేయాలి. మా సినిమాను తమిళ, మలయాళం వాళ్లు రిలీజ్ చేసుకోవాలి. మీ పేరెంట్స్ తో సినిమాకు వెళ్లండి. మంచి సమ్మర్ వెకేషన్ కు వెళ్లినట్లు ఉంటుంది.సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. ఇది నా ప్రామిస్” అని ముగించాడు.


