తెలంగాణ ప్రభుత్వ జిఓ న్యాయంగా లేదు – నిర్మాత మోహన్ వడ్లపట్ల

తెలంగాణ ప్రభుత్వ జిఓ న్యాయంగా లేదు – నిర్మాత మోహన్ వడ్లపట్ల

Published on Nov 28, 2020 5:09 PM IST

ఇటీవలే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్లు రీ-ఓపెనింగ్‌తో పాటు రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ఇస్తామంటూ ఓ జిఓ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీవో సహేతుకంగా లేదని సినీ నిర్మాత మోహన్ వడ్లపట్ల అభిప్రాయపడ్డారు. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేసుకోవాలనే నిర్ణయాన్ని థియేటర్ల యాజమాన్యాలు లేదా లీజు తీసుకున్న నిర్వాహకులకు వదిలేయడం సరికాదన్నారు.

అలాగే దీనికి బదులు కరోనా ప్రభావం క్రమంలో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చా ?లేదా? లేకపోతే ఎప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు? అనే దానిపై సూచనలు చేసి ఉంటే బాగుండేదనని సూచించారు.అలాగే చిన్న సినిమాలకు రూ.10 కోట్ల పరిమితి చాలా ఎక్కువని, రూ. 3 కోట్లలోపు లేదా అంతకంటే తక్కువ పరిమితి సహేతుకంగా ఉంటుందని మోహన్ వడ్లపట్ల అభిప్రాయపడ్డారు.

అంతే కాకుండా డిజిటల్ ప్రొవైడర్ల గుత్తాధిపత్యం సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో న్యాయమైనదిగా లేదని, కొంతమంది వ్యక్తులచే ప్రభావితమై జారీ చేసినట్లు ఉందని మోహన్ వడ్లపట్ల తన అనుమానం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు