“రామ చంద్రాపురం” టీజర్ ను విడుదల చేసిన రాజ్ కందుకూరి!

“రామ చంద్రాపురం” టీజర్ ను విడుదల చేసిన రాజ్ కందుకూరి!

Published on Jul 5, 2021 8:00 AM IST

Rama Chandrapuram

రామాయణం ఇతివృత్తం ఆధారంగా ఒక పల్లెటూరు లో జరిగే యాక్షన్ డ్రామా చిత్రం రామ చంద్రాపురం. నిహన్ కార్తికేయన్ ఆర్ సమర్పణలో త్రీ లిటిల్ మంకీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆర్ నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో ప్రశాంత్ మాడుగుల, ఐశ్వర్య, సుక్కురెడ్డి, అఖిల్ మున్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఆద్యంతం రామ చంద్రాపురం లో తెరకెక్కించడం జరిగింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి టీజర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ మేరకు మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీజర్ చాలా బావుంది అని, వైవిధ్య భరితంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. యానిమేషన్ రూపంలో చాలా కొత్తగా ఉందని అన్నారు. అయితే సినిమా కూడా బావుంటుంది అని అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని నిర్మించిన దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి అని, విజయవంతం కావాలని కోరారు.

టీజర్ విడుదల సందర్భంగా దర్శకుడు ఆర్. నరేంద్రనాథ్ మాట్లాడుతూ, తనకు అవకాశం ఇచ్చిన నిర్మాతకి ధన్యవాదాలు చెబుతూ, ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు అని అన్నారు. అద్భుతమైన క్వాలిటీ లో సినిమా రెడీ అవుతుంది అని, పల్లెటూరు నేపథ్యం లో జరిగే యాక్షన్ డ్రామా అని అన్నారు. చిత్రం మొత్తం కూడా నిజమైన లోకేషన్స్ లో చిత్రీకరించాం అని అన్నారు. అంతేకాక ఈ సినిమా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. అందరికీ నచ్చుతుంది అనే నమ్మకం ఉందని తెలిపారు. అయితే హీరో హీరోయిన్ లు మాట్లాడుతూ, రామ చంద్రాపురం పల్లెటూరి నేపథ్యం లో జరిగే యాక్షన్ డ్రామా చిత్రమని, ఈ సినిమా కోసం పని చేస్తున్న నటీనటులు, టెక్నిషియన్లు అందరూ కూడా 25 ఏళ్ల లోపు వారే అని తెలిపారు. పాటలు విడుదల అయ్యాయి, చాలా బాగా వచ్చాయి అని, టీజర్ విడుదల అయ్యింది, అందరికీ నచ్చుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు