‘అగధ’ కేవలం హారర్ మాత్రమే కాదు.. అంతకు మించి ఉంటుంది – నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి

‘అగధ’ కేవలం హారర్ మాత్రమే కాదు.. అంతకు మించి ఉంటుంది – నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి

Published on Aug 10, 2026 7:01 PM IST

టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఎమ్.ఎస్.రాజు కొంత లాంగ్ గ్యాప్ తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తెరకెక్కించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, ఉల్కా గుప్తా, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో తాజాగా నిర్వహించారు.

ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ‘అగధ’ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్.ఎస్. రాజుతో తనకున్న 45 ఏళ్ల అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘సినిమా కథనంపై పూర్తి పట్టు సాధించిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఆయన. ఇప్పుడు ‘అగధ’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్నారు. ట్రైలర్ విజువల్స్, సంగీతం, ఎడిటింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఇది కేవలం భయపెట్టే హారర్ సినిమా మాత్రమే కాదు.. మంచి ఎమోషన్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలతో కూడిన గొప్ప అనుభూతినిచ్చే చిత్రం అవుతుంది’ అని శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు.

అలాగే, కామాక్షి భాస్కర్ల స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను ముందుండి నడిపిస్తుందని, చిత్రబృందానికి పెద్ద విజయం దక్కాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు