“భీమ్లా నాయక్” పై ప్రతిదీ వస్తుంది..నిర్మాత సాలిడ్ ఆన్సర్.!

Published on Aug 15, 2021 10:57 am IST


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు నటిస్తున్న టాలీవుడ్ మరో క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్” నుంచి మోస్ట్ పవర్ ఫుల్ గ్లింప్స్ కట్ బయటికి వచ్చి భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.. అయితే ఈ గ్లింప్స్ కి సాలిడ్ రెస్పాన్స్ తో పాటుగా చిన్న నెగిటివిటి కూడా స్టార్ట్ అయ్యింది.

ఇది మల్టీ స్టారర్ చిత్రం కదా పవన్ ఒక్కడినే హైలైట్ చేసి చూపించడం ఏమిటి? అని విమర్శకుల ప్రశ్న కాగా దానికి ఈ చిత్ర నిర్మాత నాగవంశీ ఓ సాలిడ్ క్లారిటీ ఇచ్చారు. “దేన్నీ కూడా ఒక ఫైనల్ డిసిషన్ కి రావొద్దు ప్రతీది కూడా టైం ప్రకారం వస్తుంది అప్పడూ వరకు దయచేసి వేచి ఉండండి” అంటూ వారికి సమాధానం ఇచ్చారు.

ప్రస్తుతానికి అయితే మోవి లవర్స్ ఈ గ్లింప్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ ఎలెక్ట్రిఫయింగ్ మ్యూజిక్ అందిస్తుండగా సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే సితార ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :