హిరణ్య కశ్యప కు అందుకే భారీ బడ్జెట్- సురేష్ బాబు

Published on Jun 30, 2020 11:44 am IST

టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ డి. సురేష్ బాబు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా-గుణశేఖర్ కాంబినేషన్ లో రానున్న హిరణ్య కశ్యప గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ చిత్ర నిర్మాతగా ఉన్న సురేష్ బాబుని అంత బడ్జెట్ తో తెరకెక్కించడానికి కారణం ఏమిటని అడుగగా…కొన్ని చిత్రాలకు కథ రీత్యా భారీ బడ్జెట్ అవసరం, వాటిని అలానే తీయాలి. ఇవి ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే సినిమాలు అందుకే బడ్జెట్ మరియు స్క్రిప్ట్ విషయంలో రాజీపడకుండా తెరకెక్కించాలి, అన్నారు.

కాబట్టి హిరణ్య కశ్యప మూవీ భారీ స్కేల్ లో ఉండనుందని తెలుస్తుంది. ప్రీ ప్రొడక్షన్ పనులకే 15కోట్లు ఖర్చుపెట్టగా…ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ మూవీలో నిర్మాణ భాగస్వామిగా ఉండడం విశేషం. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

More