నిర్మాత వివేక్‌కు అరుదైన గౌరవం

నిర్మాత వివేక్‌కు అరుదైన గౌరవం

Published on May 15, 2025 1:30 AM IST

vivek kuchibotla

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతల్లో ఒకరైన వివేక్ కుచ్చిబొట్ల అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఏపీ రాష్ట్ర హోమ్ ఎపైర్స్ విభాగంలో సినీ రంగానికి చెందిన మెంబర్‌గా వివేక్ ఎంపికయ్యారు.

ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సినిమా రంగానికి చెందిన పలు సమస్యలను ఆయన తీర్చబోతున్నట్లు తెలుస్తోంది. వివేక్ కు ఈ పదవి దక్కడం పై పలువురు అభినందనలు తెలిపారు.

తాజా వార్తలు