సినిమాలు మొదలుపెట్టడానికి ఇవే మార్గదర్శకాలు

సినిమాలు మొదలుపెట్టడానికి ఇవే మార్గదర్శకాలు

Published on Jun 17, 2021 8:02 PM IST

కరోనా ఉధృతి తగ్గడంతో టాలీవుడ్లో సినిమాల సందడి మొదలుకానుంది. చిన్న, పెద్ద సినిమాలన్నీ సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర నిర్మాతల మండలి సినిమాలు మొదలుపెట్టే దర్శకులకు, నిర్మాతలకు కొన్ని మార్గదర్శకాలు విడుదలచేశారు. అవేమిటంటే ముందుగా కొద్దిగా షూటింగ్ మిగిలి ఉన్న సినిమాలు మొదలుపెట్టాలని సూచించారు. నటీనటులు సైతం ముందుగా వీటికి ప్రాధాన్యత ఇచ్చి వాటి తాలూకు షూటింగ్ ఫినిష్ చేశాకనే వేరే కొత్త సినిమాలకు వెళ్లేలా డేట్స్ అడ్జెస్ట్ చేయాలి.

కొత్త సినిమాలు మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకునే దర్శక నిర్మాతలు ఇంకొన్నిరోజులు ఆగాక మొదలుపెట్టాలి. షూటింగ్లో పాల్గొనే సభ్యులు అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వెయుంచుకుని ఉండాలని, దానికి సంబంధించిన సర్టిఫికేట్ చూపాలని తెలిపారు. సో.. నిర్మాతల మండలి సూచించిన ఈ సూచనలు పాటిస్తే సినిమాల పరంగా, ఆరోగ్యం పరంగా అందరికీ మంచిది. ఇకపోతే ఈ జూన్ నెలాఖరుకి కొన్ని పెద్ద, మధ్యతరహా సినిమాలు మొదలుకానుండగా వచ్చే నెలలో చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు సెట్స్ మీదకు వెళ్లనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు