త్రివిక్రమ్ పేరిట రూమర్స్..వాటికి క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు!

Published on Nov 27, 2021 12:00 pm IST

మన టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “భీమ్లా నాయక్” సినిమాకి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ సినిమాని కూడా ప్లాన్ చేస్తున్నారు. దీనికి ప్రీ ప్రొడక్షన్ సహా ఇతర పనులు నడుస్తున్నాయి.

అయితే ఇపుడు ఏమైందో కానీ త్రివిక్రమ్ పేరిట కొన్ని ఫేక్ పోస్టులు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నట్టు బయటకి వచ్చింది. అది కూడా ఏపీలో నెలకొన్న టికెట్ ధరల ఇష్యూకి సంబంధించి అన్నట్టు అర్ధం అవుతుంది. మరి దీనిపైనే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఒక క్లారిటీ ఇచ్చారు.

త్రివిక్రమ్ ఎలాంటి పోస్టులు చెయ్యలేదని, ఒకవేళ తనకి సంబంధించి వచ్చినా అవి హాసిని ఎంటర్టైన్మెంట్స్ నుంచి అలాగే తన ప్రొడక్షన్ హౌస్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ నుంచే వస్తాయని క్లారిటీ ఇచ్చారు. అలాగే త్రివిక్రమ్ కి ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవని ఆయన ఫోటో పేరు పెట్టుకొని పోస్ట్ చేసే వారికి దీనికి సంబంధం లేదని ఏపీ సీఎం, మంత్రి పేర్ని నాని ల హ్యాండిల్స్ ను ట్యాగ్ చేసారు.

సంబంధిత సమాచారం :