శ్రీహరి గొప్పతనం చెప్పిన స్టార్ కమెడియన్ !

Published on Jun 7, 2021 6:57 am IST

రియల్‌ స్టార్‌ శ్రీహరి ఎంతో మంచి వ్యక్తి అని, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆయన సాయం చేసేవారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే, తాజాగా శ్రీహరి గొప్పతనం గురించి కమెడియన్ పృథ్వీరాజ్‌ ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చాడు. నటుడు బెనర్జీ, సుదర్శన్‌, జ్యోతిలతో కలిసి ఈటీవీలో సుమ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే ‘క్యాష్‌’ కార్యక్రమంలో పాల్గొన్నాడు పృథ్వీరాజ్‌.

ఎవరైనా ఆర్ధిక ఇబ్బందులతో తన ఇంటి దగ్గరకు వస్తే.. కొంత డబ్బుకు రాయికి కట్టి దానిని గుడ్డలో చుట్టి వారికీ అందేలా రోడ్డుపైకి శ్రీహరి విసిరేసేవారని పృథ్వీరాజ్‌ చెప్పాడు.అలా శ్రీహరి నుండి డబ్బు తీసుకున్న వాళ్ళల్లో ఎంతోమంది సినిమా వాళ్లతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఉన్నారట. ఇక ఈ కార్యక్రమంలో సుమ తనదైన పంచులతో ప్రేక్షకులను అలరించారు.

అలాగే సుమకి పోటీగా కమెడియన్లు కూడా పంచ్ డైలాగ్‌లతో, ఫన్నీ టాస్క్‌లతో సందడి చేస్తూ మధ్యమధ్యలో కొన్ని ఎమోషనల్ సంగతులు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా శ్రీహరి గురించి అలాగే బెనర్జీ ఉదయ్‌కిరణ్‌ గురించి మాట్లాడిన మాటలు కూడా ఎమోషనల్ గా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :