మహేష్ సినిమాలో పృథ్వీరాజ్ క్యారెక్టర్ అదే ?

Published on Oct 4, 2022 1:05 am IST

మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ ఇద్దరూ పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో మహేష్ కి విలన్ గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ ను తీసుకోబోతున్నారు. సినిమాలో పృథ్వీరాజ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఈ పాత్రకి పృథ్వీరాజ్ అయితేనే సరైన న్యాయం జరుగుతుందని భావిస్తున్నాడు త్రివిక్రమ్. అందుకే, పృథ్వీరాజ్ కు ఇప్పటికే త్రివిక్రమ్ కథ కూడా చెప్పాడట.

పృథ్వీరాజ్ ఒప్పుకుంటే.. ఈ సినిమా పై మలయాళంలో కూడా భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి. మొత్తానికి త్రివిక్రమ్ ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. పైగా పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో పూజా హెగ్డే రొమాన్స్ చేయనుంది.

సంబంధిత సమాచారం :