సెన్సార్ పూర్తి చేసుకున్న “పొన్నియిన్ సెల్వన్”…ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్!

Published on Sep 24, 2022 2:00 am IST


సెన్సేషన్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కి సెన్సార్ బోర్డు వారు యూ/ఎ ఇచ్చినట్లు గా తెలుస్తోంది. ఈ చిత్రం 2 గంటల 47 నిమిషాల నిడివి కలిగి ఉంది. అయితే ఈ చిత్రం ను సెప్టెంబర్ 30, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో భారీగా విడుదల చేస్తుండటం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ వేగవంతం గా ప్రమోషన్స్ ను చేస్తోంది. దేశ వ్యాప్తంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది. విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, ప్రభు, ఆర్. శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, రహ్మాన్, ఆర్. పార్తిబన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :