ఓటీటీ లోకి వచ్చేసిన ‘సైక్ సిద్ధార్థ’.. కానీ ఓ ట్విస్ట్..!

ఓటీటీ లోకి వచ్చేసిన ‘సైక్ సిద్ధార్థ’.. కానీ ఓ ట్విస్ట్..!

Published on Feb 3, 2026 9:00 AM IST

Psych Siddhartha

​ఈ ఏడాది టాలీవుడ్‌లో విడుదలైన మొదటి సినిమాగా ‘సైక్ సిద్ధార్థ‘ (Psych Siddhartha) నిలిచింది. శ్రీ నందు హీరోగా నటించిన ఈ వెరైటీ డ్రామాకు వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించింది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత, ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది.

​ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లు ఈ సినిమాను ఈరోజే వీక్షించవచ్చు. మిగిలిన సాధారణ సబ్‌స్క్రైబర్లకు ఈ చిత్రం రేపటి నుండి అందుబాటులోకి రానుంది.

​థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ సినిమా అటు కంటెంట్ పరంగా, ఇటు వసూళ్ల పరంగా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే, ఓటీటీలో ఇలాంటి విభిన్నమైన కథాంశం ఉన్న చిత్రాలకు ఆదరణ లభించే అవకాశం ఉంటుంది. డిజిటల్ ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతవరకు ఆదరిస్తారో వేచి చూడాలి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తాజా వార్తలు