3000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానున్న ‘పులి’

3000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానున్న ‘పులి’

Published on Sep 27, 2015 7:30 PM IST

Puli
సౌత్ ఇండియన్ స్టార్ నటీనటులతో తెరకెక్కిన సినిమా ‘పులి’. తమిళ స్టార్ హీరో ఇలయథలపథి విజయ్ హీరోగా అందాల భామలు శృతి హాసన్, హన్సిక హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి, కన్నడ స్టార్ సుధీప్ లు ముఖ్య పాత్రలు పోషించారు. ఆని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఒకేసారి మూడు భాషల్లో రిలీజ్ కానుంది. స్వతహాగా ఈ సినిమాని తమిళంలో నిర్మించిన స్టార్ పవర్ వల్ల తెలుగు, హిందీ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అంతే కాకుండా విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ రిలీజ్ గా ఈ సినిమాని ప్లాన్ చేసారు.

మాకు అందిన సమాచారం ప్రకారం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో కలిపి ఈ సినిమాని 3000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఇంకా థియేటర్స్ కౌంట్ పెరుగుతోంది. ఓవరాల్ గా రిలీజ్ టైంకి 3500 కూడా టచ్ అయ్యే అవకాశం ఉందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ కెరీర్లో ఈ రేంజ్ లో రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమా మొదటి వారమే రికార్డ్ కలెక్షన్స్ సృష్టిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. పులి సినిమా మూడు భాషల్లో అక్టోబర్ 1న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు