‘పులి’ రిలీజ్ కి బ్రేక్స్

‘పులి’ రిలీజ్ కి బ్రేక్స్

Published on Oct 1, 2015 8:28 AM IST

Puli
సౌత్ ఇండియన్ తో పాటు బాలీవుడ్ స్టార్ నటీనటులతో తెరకెక్కిన సినిమా ‘పులి’. తమిళ స్టార్ హీరో ఇలయథలపథి విజయ్ హీరోగా అందాల భామలు శృతి హాసన్, హన్సిక హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి, కన్నడ స్టార్ సుధీప్ లు విలన్స్ గా నటించారు. ఆని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ రోజు ఒకేసారి తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా రిలీజ్ కి బ్రేక్ పడింది.

నిన్న ఉదయం విజయ్ తో పాటు పలువురి మీద ఐటి రైడ్స్ జరగడంతో నిన్న సాయంత్రం నుంచి సడన్ గా పలువురు డిస్ట్రిబ్యూటర్స్ రివర్స్ అవ్వడం వలన ఫైనాన్సియల్ ఇబ్బందులు తలెత్తాయి. నిన్న సాయంత్రం నుంచి ఈ ఫైనాన్సియల్ సమస్యని పరిష్కరిద్దాం అని చూస్తున్నా ఇంకా సెట్ అవ్వలేదు. అందులో భాగంగానే అనిచోట్లా మార్నింగ్ షోస్ ని కాన్సల్ చేసారు. దాంతో అభిమానులు, మూవీ లవర్స్ అంటా మధ్యాహ్నం ఆటకన్నా సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని ఎంతో ఆసక్తిగా పులి టీం నుంచి వచ్చే అనౌన్స్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో కలిపి ఈ సినిమాని 3000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. చింబుదేవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు