‘పులి’ ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్

puli

తమిళ స్టార్ హీరో ఇలయదలపథి విజయ్ హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘పులి’. అభిమానులు ఎంతగానో ఇందూరు చూస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని నిన్న రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ కి అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ ఒక వారియర్ లుక్ లో కనిపించాడు. చూడడానికి డ్రెస్సింగ్ అంతా వారియర్ గెటప్ లో ఉన్నా తన హెయిర్ స్టైల్ లుక్ మాత్రం చాలా స్టైలిష్ గా ఉంది. దాంతో ఈ సినిమాపై అభిమానులకు అంచనాలు పెరుగిపోయాయి.

చింబుదేవన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన శృతి హాసన్, హన్సిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి, కన్నడ స్టార్ సుధీప్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. ఇది కాకుండా విజయ్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ జిల్లా తెలుగు వెర్షన్ త్వరలోనే రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

Exit mobile version