పురాణపండ వినాయకుణ్ణి ఎంతందంగా అందించిందో మంత్రి రోజా

పురాణపండ వినాయకుణ్ణి ఎంతందంగా అందించిందో మంత్రి రోజా

Published on Aug 25, 2022 7:07 PM IST

నిర్మాతలు అశ్వనీదత్, సాయి కొర్రపాటి పై సినీవర్గాల అభినందన వర్షం

Puranapanda Srinivas, RK Roja, Sai Korrapati, Aswani Dutt, Dr. L Jayanthi Reddy, Nag Ashwin, Bollineni Krishnaiah

హైదరాబాద్ : ఆగస్ట్ : 25

యూట్యూబ్ , పేస్ బుక్ , ఇంస్టాగ్రామ్ , సోషల్ మీడియా , ఆహా …. వంటి ఎన్నో మాధ్యమాలు విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ రోజుల్లో … పుస్తకాలకు గిరాకీ డెబ్భై శాతం తగ్గిన ఈ కాలంలో … ఒక పుస్తకాన్ని ఎంతెంతో ఆకర్షణీయంగా తీయడమే కాకుండా … అతి అరుదైన కంటెంట్ తో అద్భుతంగా నాణ్యతాప్రమాణాలతో ప్రచురించి వేలమంది పాఠకులను , మేధో సమాజాన్ని తనవైపు తిప్పుకుంటున్న ఒకానొక పుస్తకమాంత్రికుడు అసాధారణ కృషి, అద్భుతమైన భాషాశైలి, నాణ్యతాప్రమాణాల ముద్రణా నైపుణ్యం , ధార్మిక నిబద్ధత, రాజీపడని కఠిన మనస్తత్వం, ఇంచుకమాత్రం కూడా వ్యాపార స్వార్ధంలేకపోవడం … ఇవే ఈతని అపురూపపు జీవన కవిత్వ సాహిత్య ఆధ్యాత్మిక ధార్మిక వ్యక్తిత్వాన్ని హాట్ టాపిక్ గా మార్చాయి. ఈ హాట్ టాపిక్ కి తెరతీస్తే కనిపించే చిత్రం … పుస్తక మాంత్రికుడు , మహా సారస్వతంతో సంచరించే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ శ్రమైక జీవన సౌందర్యం.

ఈవారం హైదరాబాద్ లో జూబిలీహిల్స్, బంజారాహిల్స్ , ఫిలింనగర్ లలో సినీ ప్రముఖులు, వైద్యులు, రాజకీయ ప్రముఖుల వద్ద, విశాఖపట్నం సంపత్ వినాయకుని ఆలయం , విశ్వహిందూ పరిషద్ కార్యకర్తలవద్ద , ఉభయ గోదావరి జిల్లాలలో అనేక వ్యాపార సంస్థలు, ఆలయాలు , రాజకీయ ప్రముఖుల వద్ద, వరంగల్ భద్రకాళి, వెయ్యిస్తంభాల ఆలయాలవద్ద …. ఇలా ఏదో ఒక ఏరియాలో కాకుండా అనేకమంది ప్రఖ్యాత వ్యక్తుల వద్ద సౌందర్య జలపాతం లాంటి అద్భుతమైన ప్రత్యేక పుస్తకం విపరీతంగా , ఆశ్చర్యంగా, పవిత్రంగా ఆకర్షిస్తోంది . ముఖపత్రం చూస్తే చాలు … పరవశించిపోయేలా తీశారు పురాణపండ శ్రీనివాస్.

ఎవ్వరైనా శ్రీ వినాయక చవితికి శ్రీ వరసిద్ధివినాయక వ్రతకల్పాన్ని ఒక పదో, పన్నెండు పేజీలతో మామూలుగా ముద్రించేసి ఒక పది రూపాయలకు, పదిహేను రూపాయలకు విక్రయించేస్తారు. ఈ అంశాన్ని మనం ఎక్కువగా పత్రి, వినాయక మట్టి ప్రతిమ కొనుక్కునే సందర్భంలో చూస్తాం. కానీ .. . పురాణపండ శ్రీనివాస్ ఈ స్పెషల్ బుక్ ని అదరగొట్టేసారు . ఈ పుస్తకం పేరు ‘ విఘ్నరాజం భజే ‘ . ఏకంగా తెలుగు సచిత్ర వారపత్రిక సైజులో , జపాన్ ఆర్ట్ పేపర్ పై , డిజిటల్ మల్టీ కలర్ లో ముద్రించడమొక్కటే అత్యద్భుత ఆకర్షణగా మలచకుండా … మొదటి నాల్గు పేజీల్లో ఇచ్చిన అద్భుతమైన అపురూపపు తీయని తేనియళ్ళని కొన్ని అంశాలు అదరహో అనిపించేలా రాసిన పురాణపండ శ్రీనివాస్ ని ఇటు కొందరు సినీ రచయితలు, సాహితీవేత్తలు అభినందించడం విశేషం.

కేవలం వ్రతకల్పమొక్కటే కాకుండా .. ఉచ్చిష్ట గణపతి స్తోత్రం, మరకత గణపతి స్తోత్రం , కాశీక్షేత్రంలో ఉన్నాయని లక్షలాదిమందికి తెలియని యాభై రెండు గణపతుల అంశాల వివరంగా అందిచడం ఒక పవిత్రమైన అంశమైతే , ఆనాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి , ఆనాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టీ. రామారావు , నేటి భారత ప్రధాని నరేంద్రమోదీ వంటి రాజకీయప్రముఖులు సైతం నిత్యం పారాయణమ్ చేసి తరించిన, తరిస్తున్న శ్రీరామ రక్షాస్తోత్రమ్ ఈ పరమ శోభాయమాన గ్రంధంలో లభించడం భక్త పాఠకులకు ఒక వరమని చెప్పాలి. ఇంతే కాకుండా పురాణపండ శ్రీనివాస్ కి ఎంతెంతో ఇష్టమైన మహా నారసింహుని ఆవిర్భావ ఘట్టాన్ని కూడా ఎంతో సులభ సుందర శైలిలో పండిత పామరజనరంజకంగా ఇదే సుందర గ్రంధంలో ఇవ్వడం ఒక్క పురాణపండ శ్రీనివాస్ కె చెల్లింది. ఈ కథ చదివే కొద్దీ మనకళ్లముందు దృశ్యాలు కదులుతాయి. అంత అద్భుతంగా శ్రీనివాస్ అందించారు. దీనికి అనుబంధ సుగంధంగా శ్రీ ఆదిశంకరాచార్య ప్రణీతంగా కోట్లాది భారతీయుల్ని జీవితంపట్ల అప్రమత్తం చేసి , దుఃఖాల్ని దూరం చేసే శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఇందు చేర్చడం బంగారానికి సుగంధం అబ్బినట్లుండనేది మేధో సమాజం అంగీకరించే సత్యం.

మరీ ముఖ్యంగా ఈ మహాగ్రంధాన్ని, పవిత్రసొగసులు వర్షించే అపురూపపు విలువల గ్రంధాన్ని తెలుగు రాష్ట్రాలకు వేలకొలది గ్రంధాలు అందిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి రోజాపై అభినందనలు వర్షిస్తున్నాయి. అనేక గణేశ క్షేత్రాలకు వందల కొలది పంచిన వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి చేస్తున్న ధార్మిక సేవ నిరుపమానం. ముఖ్యంగా వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్, శ్రీమతి వినయకుమారి దంపతులు , మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తల్లి తండ్రులు డాక్టర్ జయంతీరెడ్డి, డాక్టర్ జయరాంరెడ్డి , ప్రఖ్యాత వైద్య ఆరోగ్య శాల కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొల్లినేని క్రిష్నయ్య తెలంగాణా ప్రాంతంలో అనేక కార్పొరేట్ సంస్థలు, సినీ ప్రముఖులకు , మీడియా వారికి ఈ మహోత్తమ గ్రంధాన్ని ఎంతో సమర్పణభావంతో ఇవ్వడం ఎంతోమంది చేత అభినందింప చేసింది.
ఇదిలా ఉండగా … ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి రోజా ఇటు తిరుపతి పండితులకు, అర్చకులకు , కొన్ని వేదపాఠశాలలకు , తెలంగాణలోని యాదాద్రి దేవాలయ ప్రముఖులకు తన సహచర అనుచర వర్గంతో ప్రత్యేక శ్రద్ధతో వితరణ చేయించడం ఆమెకు ఆశీస్సులందించాయి. మణికొండ, ఐనవిల్లి, బిక్కవోలు , సికింద్రాబాద్ మహాగణపతి గుడి, శృంగేరి గణపతి దేవాలయం వంటి చోట్ల సాయి కొర్రపాటి విఘ్నరాజం భజే చాలా ఆకట్టుకున్నాయని పండితులే వేనోళ్ళ ప్రశంసలు వర్షించారు. ఏదేమైనా కొన్ని సంవత్సరాలుగా ఇంతటి పరమ పవిత్ర మహోద్యమాన్ని భుజాలకెత్తుకుని , బంధాలకు దూరంగా, గాఢమైన భక్తికి దగ్గరగా , వీసమెత్తు స్వార్ధం లేకుండా స్వచ్ఛమైన హృదయంతో పరమాత్మ సౌందర్యాల్ని పదిమందికీ చేసుస్తున్న పురాణపండ శ్రీనివాస్ మహా ప్రతిభను అనుగ్రహిస్తున్న ఆయన ఇష్ట దైవాలు శ్రీశైలం మల్లన్న , తిరుమల వెంకన్న కటాక్షించి … ఇంకా బలాన్నివ్వాలని కోరుకోవడం మన కర్తవ్యం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు