
మెగాస్టార్ చిరంజీవి.. ఈయన సినిమాలు చేసి 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయనకీ ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. చిరు ఎప్పుడైతే 150వ సినిమా చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో అప్పుటి నుండే ఆ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి 150వ సినిమాలో చిరుని డైరెక్ట్ చేసేది వీళ్ళే అని పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ ఒక్కరి పేరు కూడా ఫైనలైజ్ కాలేదు. తాజాగా పూరి జగన్నాధ్ చిరుని డైరెక్ట్ చెయ్యడానికి అత్యంత ఆసక్తి చూపుతున్నాడు.
నాకు చిరంజీవి గారి 150 సినిమాకి డైరెక్ట్ చెయ్యాలని ఎంతో ఆశగా ఉంది. చెప్పాలంటే నేను నాకు చిరంజీవి 150వ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. చిరు గారి సినిమాకో కోసమే ఆటో జానీ అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేసానని తెలియజేశాడు. ప్రస్తుతం చిరుకి సరిపోయేలా ఓ స్క్రిప్ట్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మించనున్నాడు. పూరి జగన్నాధ్ ప్రస్తుతం చార్మీతో తీయనున్న ‘జ్యోతి లక్ష్మీ’ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు.

