‘ఆటోజానీ’పై రూమర్లను నమ్మకండి : పూరీ జగన్నాథ్

‘ఆటోజానీ’పై రూమర్లను నమ్మకండి : పూరీ జగన్నాథ్

Published on May 13, 2015 4:30 PM IST

Puri

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు తెరపడిన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిరు 150వ సినిమా ఉంటుందన్న విషయాన్ని ఈ సినిమాను నిర్మించనున్న రామ్ చరణ్ ఇప్పటికే తెలియజేశారు. బీవీఎస్ రవి, గోపీ మోహన్‌లు స్క్రిప్ట్ సమకూరుస్తున్నారు. అయితే ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర్నుంచే ఈ సినిమా విషయంలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. అమెరికాకు చెందిన వాసు దేవ్ వర్మ అనే రచయిత చిరు 150వ సినిమా తనదేనని, ఈ విషయంపై పోరాడతానని ప్రకటించారు.

ఇక ఈ విషయంపై ఇప్పటికే రచయితలు రవి, గోపీ మోహన్‌లు ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ కథ తమ సొంత కథని ప్రకటించారు. తాజాగా ఇదే విషయంపై దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా స్పందించారు. తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. “ఆటోజానీ మూలకథ నేను సొంతంగా రాసినది. ఈ విషయంపై చెలరేగిన రూమర్లను నమ్మకండి” అంటూ అభిమానులకు పిలుపునిచ్చారు పూరీ జగన్నాథ్. చిరు పుట్టినరోజైన ఆగష్టు 22న ఈ సినిమాను లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు