‘జనగణమన’కు పూరి అనుకుంటున్న హీరో అతనేనా ?

Published on Jul 21, 2019 8:02 pm IST


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది ‘జనగణమన’. ఈ సినిమాను మహేష్ బాబుతో చేయాలని పూరి ఎన్నాళ్లగానో ఎనుకుంటున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఇందులో మహేష్ బాబు నటించే సూచనలు కనిపించట్లేదు. మొన్నామధ్య పూరి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే ఈ కాంబినేషన్ కుదరదని స్పష్టమైపోయింది. దీంతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం పూరి ఏ హీరోని ఎంచుకుంటాడో అనే ఆసక్తి అందరిలోనూ కలిగింది.

ఇదిలా ఉండగానే పూరి ఛాయిస్ విజయ్ దేవరకొండ అనే వార్త ప్రచారంలోకి వచ్చేసింది. ఈ వార్తను విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసేశారు. నిజంగా పూరి, దేవరకొండ కాంబినేషన్ కుదిరితే చాలా బాగుంటుంది. కానీ అసలు ఈ వార్త నిజమా కాదా అనేదే మోడల్ తేలాల్సి ఉంది. అది తేలాలంటే పూరి నోరు విప్పాల్సిందే. ఇకపోతే పూరి కొత్త చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ విజయం దిశగా దూసుకుపోతుండగా విజయ్ చేసిన ‘డియర్ కామ్రేడ్’ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం :