విజయ్ దేవరకొండ ఫైట్ డాన్ తోనేనా ?

Published on Apr 21, 2020 8:00 am IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన సక్సెస్ కిక్ తో ప్రస్తుతం క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ సినిమా చేస్తోన్నాడు. కాగా తాజాగా ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకు పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని.. అయితే విజయ్ డాన్ కొడుకుగా కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని.. ఆ తరువత చాల భాగం డాన్ కి వ్యతిరేకంగా పని చేస్తుంటాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

కాగా లాస్ట్ షెడ్యూల్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌మ్య‌కృష్ణ‌, అన‌న్యా పాండే, రోణిత్ రాయ్‌, అలీ త‌దిత‌రుల‌పై ముఖ్య‌మైన స‌న్నివేశాలు తీశారు. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు.

ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :