డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన పూరీ మ్యూజింగ్స్ భాగంగా ఈ రోజు ‘యాసిడ్ రెయిన్’ అనే అంశం గురించి చెప్పుకొచ్చాడు. పూరి మాటల్లో.. “నాలుగు వందల కోట్ల సంవత్సరాల క్రితం వర్షాలు పడి సముద్రాలు పుట్టాయి. దాంతో అనేక జీవాలు పుట్టుకొచ్చాయి. హాయిగా ఆడుకుంటున్నాయి. అయితే రెండు వందల మిలియన్ సంవత్సరాల క్రితం అగ్నిపర్వతాలు బద్దలు కావడంతో రకరకాల గ్యాసులు రిలీజై ఆకాశం నుండి యాసిడ్ వాన పడింది. నైట్రిక్, సల్ఫూరిక్ యాసిడ్స్ కలిసిన వర్షం అది. ఆగకుండా రెండు మిలియన్ సంవత్సరాలు పడింది. దీంతో సముద్రంలో జలచరాలు చచ్చిపోతాయి. ఆ కాలంలోని డైనోసార్స్ సహా అన్నీ జంతువులు చచ్చిపోయాయి. ఇదంతా భూమి ఒకే ఖండంగా ఉన్నప్పుడు జరిగిందట.
ఆ యాసిడ్ వాన వల్ల సముద్ర జలాలు ఉప్పుగా తయారయ్యాయి. మళ్లీ ఆ సముద్ర నీటికి తగ్గట్లు జలచరాలు పుట్టాయి. తర్వాత మనం పుట్టాం. అలా ఇలా బ్రతుకుతూ కరోనా వరకు వచ్చాం. కొన్ని వందల సంవత్సరాల నుండి మనం బొగ్గును తగలబెడుతున్నాం. వీటి వల్ల మనకు మళ్లీ యాసిడ్ రెయిన్ పడే అవకాశం ఉంది. ఈ వాన పడితే ముందు పక్షులు, తర్వాత చెట్లు అన్నీ చచ్చిపోతాయి. తర్వాత మనం కూడా చచ్చిపోతాం. ఇప్పుడు వైరస్లకంటే, గ్రహ శకలాల ఢీ కొట్టడం కంటే, మూడో ప్రపంచ యుద్ధం కంటే చాలా పెద్ద ప్రమాదం ఏదైనా ఉంటే యాసిడ్ రెయిన్ మాత్రమే. మనుషులు పెరిగే కొద్దీ కాలుష్యం పెరుగుతుంది” అంటూ పూరి అంటూ యాసిడ్ రైన్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.
ప్రస్తుతం ఈ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. కరోనా దెబ్బకు అందరూ లాక్ డౌన్ లో ఉన్నారు. అయితే పూరి మాత్రం ఈ ఖాళీ సమయంలో కూడా ఓ స్టార్ హీరో కోసం ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాసాడట. పూరి కథ రాసింది బాలయ్య కోసమే అని తెలుస్తోంది. ఫైటర్ సినిమా తరువాత బాలయ్య – పూరి సినిమానే మొదలవుతుందట.


